సన్‌రైజర్స్‌ తో యాంకర్ సుమ

SMTV Desk 2019-03-21 13:10:55  anchor suma, sunrisers, david warner, bhuvaneshwar kumar, lakshman

హైదరాబాద్, మార్చ్ 20: ఈ నెల 23న ప్రారంభం కానున్న 12వ ఐపీఎల్‌ సీజన్‌కు అన్ని జట్లు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. అయితే జట్ల వారు తమ ప్రాక్టీస్ అనంతరం ఖాళీ సమయాల్లో యాడ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. తాజాగా ప్రముఖ టీవీ యాంకర్‌ సుమతో కలిసి డేవిడ్‌ వార్నర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, లక్ష్మన్ సందడి చేశారు. ఓ టీవీ యాడ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ జట్టు సభ్యులతో కలిసి సుమ అలరించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈవారంతో అతడిపై నిషేధం పూర్తికానుంది. దీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున వార్నర్‌ మళ్లీ బరిలో దిగేందుకు సిద్దమవుతున్నాడు. ఈనెల 24న కోల్‌కతాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మొదటి మ్యాచ్ ఆడనుంది.