గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సర్కార్ చర్యలు

SMTV Desk 2019-03-21 12:49:42  ktr, state government, trs, trs party working president, lb stadium

హైదరాబాద్, మార్చ్ 20: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది అని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు హామీ ఇచ్చారు. దీని కోసం గ్రామాల్లో క్రీడా మైదానాల నిర్మాణాలు చేపడుతామని అన్నారు. ఓ మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు మాజీ మంత్రి కెటిఆర్ హాజరయ్యారు. మంగళవారం ఎల్.బి.స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహబూబ్‌నగర్ జట్టు విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం కెటిర్ విజేత జట్టుకు ట్రోఫీని బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.