ప్రపంచంలోనే మొదటిసారి...5జీ టెక్నాలజీతో బ్రెయిన్‌ సర్జరీ

SMTV Desk 2019-03-21 12:35:04  Human brain surgery , 5G technology, Huawei, Dr. Ling Zhipei ,

బీజింగ్‌, మార్చ్ 20: చైనా దేశం టెక్నాలజీ రంగంలో రోజురోజుకి ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో చైనా రాజధాని బీజింగ్ లో ఓ అద్భుత సంఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా 5జీ టెక్నాలజీతో బ్రెయిన్‌ సర్జరీ చేశారు. 3000 కిలోమీటర్ల దూరంలో ఉండి రిమోట్‌ కంట్రోల్ ద్వారా 3గంటలపాటు కష్టపడి ఆపరేషన్‌ ను సక్సెస్‌ చేశారు డాక్టర్‌ లింగ్‌ జీపి. పీఎల్‌ఏ జనరల్‌ ఆస్పత్రిలో పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్న ఓ పేషెంట్‌ కి.. న్యూరోస్టిమ్యులేటర్‌, బ్రెయిన్‌ పేస్‌ మేకర్‌ను ఎక్కించారు. చైనాకు చెందిన హవాయీ మొబైల్‌ కంపెనీ రూపొందించిన 5జీ టెక్నాలజీకి అనుసంధానం చేసిన కంప్యూటర్‌ ద్వారా ఈ శస్త్రచికిత్స నిర్వహించారు డాక్టర్‌. ఈ సందర్భంగా డాక్టర్‌ లింగ్‌ మాట్లాడుతూ...సర్జరీ చేస్తున్నంత సేపు రోగి 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఒక్కసారి కూడా అనిపించలేదు అని చెప్పారు.