21న ఎంపి అభ్యర్థుల ప్రకటన

SMTV Desk 2019-03-21 12:20:40  kcr, trs, mp , loksabha elections

హైదరాబాద్, మార్చ్ 19: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్‌ఎస్ పార్టీ ఎంపి అభ్యర్థులను ఈ నెల 21వ తేదీన ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలిపించిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. మరో ఐదేళ్లు పరిపాలన చేయాలంటే 16కు 16 ఎంపిలను గెలిపించాలని అన్నారు. ఒక బండి ముందటికి పోవాలంటే రెండు కోడెలాగలైనా కట్టాలి…లేకపోతే రెండు దున్నపోతులైనా కట్టాలి అని అన్నారు. ఎంఎల్‌లను గెలిపించిన విధంగా 16 మంది టిఆర్‌ఎస్ ఎంపిలను కూడా గెలిపించాలని అన్నారు. ఆ శక్తితోనే ఆ బలంతోనే రాష్ట్రాన్ని బాగుచేసుకోవడమే కాదు కచ్చితంగా దేశానికి కూడా మార్గదర్శనం చేద్దామని చెప్పారు. దానికి మీ దీవెన, మీ సహకారం కవాలని కోరుతున్నానని సిఎం పేర్కొన్నారు. ఎవరు అభ్యర్థి అయినా సరే దయచేసి మీ దీవెన ఇచ్చి కారు గుర్తుకు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాలని సిఎం కెసిఆర్ కోరారు.