హోటల్ నుండి పారిపోయిన ‘దండుపాళ్యం’నటి పూజాగాంధీ

SMTV Desk 2019-03-21 12:19:39  dandupalyam movie, pooja gandhi

బెంగూళూరు, మార్చ్ 19: ‘దండుపాళ్యం’ నటి పూజాగాంధీ వివాదంలో చిక్కుకుంది. ఆమె బెంగళూరులోని ఓ ఖరీదైన హోటల్లో బస చేసి, బిల్లు కట్టకుండా పారిపోయారు. మొత్తం బిల్లు రూ. 4.5 లక్షలను ఆమెతో కట్టించాలని హోటల్ యాజామాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంగతి వెలుగు చూసింది. పోలీసులు ఆమెకు సమన్లు పంపారు. దీనిపై పూజా స్పందిస్తూ.. తాను రూ. 2 లక్షలు చెల్లించానని, బకాయి కూడా చెల్లిస్తానని చెప్పానని, అయితే హోటల్ యాజమాన్యం ఓపిక పట్టకుండా యాగీ చేస్తోందని ఆరోపించారు. పూజకు ఇలాంటి గొడవలు కొత్త కాదు. గతంలో పారితోషికం విషయంలో నిర్మాత కిరణ్‌తో గొడవ పడ్డారు. ఇద్దరు నష్టం దావాలు వేసకున్నారు. పెట్టుకున్నారు.