స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు

SMTV Desk 2019-03-21 12:13:43  Sensex, Nifty, Stock market, Share markets

ముంబై, మార్చ్ 19: మంగళవారం దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెస్సెక్స్‌ 83 పాయింట్ల లాభంతో 38,167 వద్ద, నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 11,500 వద్ద ట్రేడవుతున్నాయి. అలాగే రూపాయి స్వల్పంగా 2 పైసలు విలువ కోల్పోయి 68.55 ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. ఆ తర్వాత బలపడి 9.45 సమయంలో 68 వద్ద ట్రేడవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లు మందకొడిగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ సూచీలు 0.5 శాతం విలువ కోల్పోగా ఆస్ట్రేలియా సూచీలు 0.1 శాతం విలువ కోల్పోయాయి.