శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో తప్పిన పెను ప్రమాదం

SMTV Desk 2019-03-21 12:08:55  shamshabad airport, huderabad, soudi plane, laser light, rasheed guda

హైదరాబాద్/శంషాబాద్, మార్చ్ 19: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆదివారం రాత్రి సౌదీ నుంచి వచ్చిన సౌదీ ఎయిర్‌ లైన్స్‌ శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో ల్యాండ్‌ అవ్వాల్సింది ఉంది. ఈ క్రమంలో విమానాన్ని కిందకు దించే సమయంలో లేజర్‌ లైటింగ్‌ కారణంగా పైలట్‌ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. తర్వాత ఎలాగో విమానాన్ని కిందకు దించారు. వెంటనే ఈ విషయాన్ని ఎయిర్‌ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు..స్పందిస్తూ ఆరోజు శిమమణి అనే యువకుడు రషీద్‌ గూడలో తన పుట్టినరోజు జరుపుకున్నాడు. వేడుకల్లో భాగంగా లేజర్‌ ను వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇంతకు ముందే ఎయిర్‌పోర్టు నుంచి 15 కిలోమీటర్ల పరిధి మేర లేజర్‌ లైటింగ్‌లను అధికారులు నిషేధించారు. నిషేదించిన లేజర్‌ ను వాడినందుకు శివమణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది