ఆఫ్రికన్‌ దేశాల్లో ఇడాయ్ సైక్లోన్‌ ఎఫెక్ట్ : @1000 మందికి పైగా మృతి

SMTV Desk 2019-03-21 12:06:29  african countrys, iday cyclone, Impact of Cyclone Iday, Cyclone Iday

మార్చ్ 19: మొజాంబిక్, మాల్వాయి, జింబాబ్వే దేశాల్లో ఇడాయ్ సైక్లోన్‌ సంచలనం సృష్టిస్తోంది. ఈ దేశాల్లో ఇడాయ్ తుఫాన్‌ ఎఫెక్ట్‌ తో వెయ్యి మందికి పైగా మృతి చెందారని మొజాంబిక్‌ ప్రధాని పిలిపీ నైసీ వెల్లడించారు.అంతేకాక దీని ప్రభావం వల్ల లక్షలమంది ప్రజలు ప్రమాదంలో చిక్కుకున్నారన్నారు. భారీ వర్షాల ప్రభావం వల్ల పుంగ్వీ, బూజీ నదుల కట్టలు తెగి వరదనీరు గ్రామాలను ముంచెత్తిందని, దీంతో శవాలు వరదనీటిలో తేలియాడుతున్నాయన్నారు పిలిపీ. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో సహాయపనులకు విఘాతం కలుగుతోందని వెల్లడించారు. ఇక మొజాంబిక్, మాల్వాయి, జింబాబ్వే దేశాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు భారత్ ముందుకు వచ్చింది. మానవతా దృక్పథంతో మూడు నౌకలను ఆయా దేశాలకు పంపి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. మూడు నౌకల్లో ఆహారం, దుస్తులు, ఔషధాలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.