ఆ సీరియల్ పై నిషేధ౦ విధించాలి..!!!

SMTV Desk 2017-08-10 12:21:22  

న్యూ ఢిల్లీ, ఆగస్ట్ 10 : విభిన్న కథాంశంతో వస్తున్న కొన్ని రకాల సీరియల్స్ పిల్లల ఆలోచనా విధానాన్ని మార్చే విధంగా ఉన్నాయంటూ ఒక వ్యక్తి, కేంద్ర జౌళి శాఖ, సమాచార ప్రసారాల శాఖా మంత్రి స్మృతి ఇరానికి పిటీషన్ దాఖలు చేసారు. హిందీలో ప్రసారమవుతున్న "పెహ్రేదార్ పియా కీ" సీరియల్ లో కొన్ని కారణాల వల్ల 18 సంవత్సరాల యువతిని పదేళ్ళ బాలుడు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ బాలుడు ప్రేమిస్తున్నానంటూ ఆ యువతికి చెప్పడం, అమ్మాయి నుదుట బొట్టు పెట్టడ౦ ఇలాంటి సంఘటనలు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయంటూ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఇప్పటికి 36,282 మంది సంత‌కాలు చేసారు. ప్రారంభానికి ముందే వచ్చిన ఈ ప్రోమోలపై చాలా మంది అసహనం వ్యక్తం చేసారు. అయితే జూలై 17న ప్రారంభమైన సీరియల్ మొదటి ఎపిసోడ్ నుండి బాగుండడంతో ఆ ఛానల్ టీఆర్‌పీ రేటు పెరిగిందని ఆ ఛానల్ నిర్వాహకులు చెబుతున్నారు.