ప్రొస్టేట్ కాన్సర్‌ కి కాఫీ తో చెక్

SMTV Desk 2019-03-21 11:45:52  Protest cancer, Coffee,

ఉదయం లేవగానే కాఫీ తాగడం చాలామందికి అలవాటు.. ఇది అలా తాగగానే ఎంతో హాయిగా ఫీలవుతారు. కొంతమంది అయితే ఈ డ్రింక్‌కి అడిక్ట్ అయిపోతారు. ఒక్కరోజూ తాగనిదే వారికి ఏ పని తోచదు. ఆ ఇష్టంతోనే చాలామంది రచయితలు కూడా దీనిపై పాటలు కూడా రాశారు. అంతటి మహత్తు కాఫీ సొంతం. కాఫీ గురించి ఇంతలా చెబుతున్నారు కానీ అసలు మేటర్ ఏంటని అంటున్నారా.. అదే విషయానికొస్తున్నాం. కాఫీ తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. తాజాగా తేలిన విషయమేంటంటే.. కాఫీలోని కొన్ని సమ్మేళనాలు ప్రొస్టేట్ కాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడతాయని తేలింది.

అయితే ప్రయోజనాలున్నాయి కదా అని అతిగా కాఫీ తాగితే దుష్ప్రభావాలున్నాయని చెబుతున్నారు. రోజుకు 2, 3 కప్పుల కాఫీని మించి తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు.