మేలుకో బ్యాంక్ వినియోగదారుడా!!!

SMTV Desk 2017-08-10 11:55:52  Bank holidays, august month, Bank working days

ముంబై, ఆగస్ట్ 10: ఈ నెలలో మరో 20 రోజులు మిగిలివుండగా, అందులో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. దీంతో ఖాతాదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ఆయా సెలవు తేదీలకు అనుగుణంగా ముందుగానే పూర్తి చేసుకోవాలని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. 12 నుంచి 15 వరకూ నాలుగు రోజుల పాటు, ఆపై 25 నుంచి 27 వరకూ మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు. 12వ తేదీన రెండో శనివారం, ఆపై ఆదివారం, సోమవారం నాడు కృష్ణ జయంతి, మంగళవారం నాడు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరుస సెలవులు. ఆపై 25వ తేదీ శుక్రవారం నాడు వినాయక చవితి, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం రానున్నాయి. వీటితో పాటు 19వ తేదీ ఆదివారం కూడా సెలవు.