ప్రెస్ మీట్ పెట్టిన శివాజి రాజా..!

SMTV Desk 2019-03-20 16:13:29  press meet, shivaji raja,

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు నరేష్, మాజీ అధ్యక్షుడు శివాజి రాజాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మార్చి 31 దాకా ఆ పదవి నాదే నీకు ఆ చెయిర్ ఇచ్చేది లేదు అన్నట్టు శివాజి రాజా చెప్పాడని రీసెంట్ గా నరేష్ ఓ ప్రెస్ మీట్ పెట్టి శివాజి రాజపై సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాదు ఎల్.ఐ.సికి చెందిన ఓ ఫైల్ చూపిస్తూ ఆ పెండింగ్ విషయాలను ప్రస్థావించారు.

ఇక వీటికి రెస్పాన్స్ గా ఈరోజు శివాజి రాజా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. మా లో ఏదైనా గొడవలు ఉంటే టి.ఎఫ్.ఐ స్పందిస్తుందని అయితే మూడు రోజుల్లో ఎవరు వాటిపై రెస్పాండ్ అవలేదు కాబట్టి ఈరోజు తాను ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టు చెప్పుకొచ్చారు. శివాజి రాజా ప్రెస్ మీట్ లో నరేష్ కు రెండు మూడు ఛాలెంజ్ లు విసిరారు. మహేష్ తో 2 కోట్ల ప్రోగ్రాం క్యాన్సిల్ చేశావ్.. 4 నెలలు అయిపోయాయి మరో 3 నెలలు టైం తీసుకో మహేష్ ను కాని మరే హీరోని కాని ఎటైనా తీసుకెళ్లి ఓ 2 కోట్లు మా కి తెస్తావా అంటూ ఛాలెంజ్ విసిరాడు శివాజి రాజా.

తను ఓల్డేజ్ హోం కట్టిస్తానంటే భీమవరం నుండి సంచితో వచ్చిన వాడు ఓల్డేజ్ హోం ఎలా కడతాడని అదరు అనుకున్నారు. జరిగిన మా ఎన్నికల్లో తాను ఓడిపోడానికి కారణం ఓల్డేజ్ హోమే అని అన్నరు శివాజి రాజ. ఏదో దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినట్టు వేళ్లు చూపిస్తూ మాట్లాడుతున్నారని.. మేనిఫెస్టోలో ఉన్న అన్నిటిని చేసి చూపించండి అని అప్పుడు తానే వచ్చి మీకు దండ వేస్తానని చెప్పాడు శివాజి రాజ. చిరంజీవి తన సపోర్ట్ అందించారని ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని. ఇక నాగబాబు నరేష్ కు సపోర్ట్ చేయడం గురించి స్పందిస్తూ తాను నాగబాబు 30 ఏళ్లుగా స్నేహితులమని ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. త్వరలోనే నేను నాగ బాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నాడు శివాజి రాజా. మొత్తానికి మాని బజారుకీడ్చొద్దు అనుకుంటూనే వారి లొసగులను బయటపెడుతూ మా గుట్టు బయటపెడుతున్నారు శివాజి రాజా, నరేష్.