నా వారసుడు మాత్రం ఇండియా నుంచే వస్తాడు : దలైలామా

SMTV Desk 2019-03-20 16:09:34  Dalai Lama, india, china

బీజింగ్, మార్చ్ 19: బౌద్ధమత గురువు దలైలామా మంగళవారం ధర్మశాలలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ....తాను మరణించిన తర్వాత తన వారసుడిగా ఎవరి పేరునో చైనా తెరపైకి తేవాలని చూస్తోందని ఆరోపించారు. అలా చేస్తే అతణ్ణి టిబెట్ బౌద్ధులు గౌరవించే ప్రసక్తే లేదన్నారు. భారతదేశం నుంచే తన వారసుడు వస్తాడని పేర్కొన్నారు. చైనా నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని తప్పించుకుని.. 1959లో తాను ఇండియాకు వచ్చానని, అప్పటి నుంచి ప్రపంచదేశాల మద్దతుతో తన భూభాగమైన టిబెట్ కోసం పోరాడుతూనే ఉన్నానని దలైలామా తెలిపారు. ‘చైనాకు చాలా బాగ తెలుసు నా వారసుడి ఎంపిక ఎంత కీలకమని. ఈ విషయంలో నాకన్నా చైనాకే ఎక్కువ ఆసక్తి ఉంది. నా వారసుడు మాత్రం ఇండియా నుంచే వస్తాడు. రాబోయే రోజుల్లో ఇద్దరు దలైలామాలు కనిపించానా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చైనా దలైలామాను తెరపైకి తీసుకొస్తే.. అతన్ని ఎవరు నమ్మరు. దాంతో చైనాకు మరో సమస్య అవుతుంది’ అని దలైలామా చైనాకు హెచ్చరికలు జారీ చేశారు.