ఓటమి దగ్గర పడడంతో ఎంతటి సీనియర్ నాయకుడైన వణుకుతాడు ...

SMTV Desk 2019-03-20 16:01:37  Prashanth Kishore, AP Cm

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైండ్ బ్లోయింగ్ కౌంట‌ర్ ఇచ్చారు జేడీయూ నేత‌, వైసీపీ ఎన్నికల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్. ఇటీవ‌ల చంద్ర‌బాబు త‌ర‌చూ ప్ర‌శాంత్ కిషోర్ పై విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొన్న చంద్ర‌బాబు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే కాకుండా, ప్ర‌శాంత్ కిషోర్ బిహారీ బందిపోటు అని.. బీహార్ నుండి వ‌చ్చిన డెకాయిట్ ఏపీలో ఓట్లు తొల‌గిస్తున్నార‌ని వ్యాఖ్య‌లు చేశారు చంద్ర‌బాబు.

అయితే చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల పై స్పందించిన ప్ర‌శాంత్ కిషోర్.. ఓటమి దగ్గర పడినప్పుడు ఎంతటి అనుభవం ఉన్న రాజకీయ నేత అయినా వణికిపాతారని.. త‌న‌ను దూషిండం కంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు మ‌ళ్ళీ మీకు ఓటు ఎందుకు వేయాల‌నే దాని పై దృష్టి పెట్టాల‌ని ప్ర‌శాంత్ కిషోర్ సూచించారు. చంద్ర‌బాబు త‌న‌ను దూషించ‌డం చూస్తుంటే.. బిహార్ పై ఉన్న ద్వేషం, చెడు అభిప్రాయం బ‌య‌ట‌ప‌డుతోంద‌ని, అయినా ఇలాంటి నిరాధార‌మైన వ్యాఖ్య‌ల‌ను తాను అస్స‌లు ప‌ట్టించుకోన‌ని ప్ర‌శాంత్ కిషోర్ స్పష్టం చేశారు.