వివేకానంద రెడ్డి హత్య కేసులో.. మ‌రో కీల‌క వ్య‌క్తి హస్తం !

SMTV Desk 2019-03-20 15:58:53  Vivekananda reddy,

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా ద‌ర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు తాజాగా రౌడీ షీట‌ర్ దిద్దుకుంట శేఖ‌ర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద‌రెడ్డి హత్యలో శేఖ‌ర్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.

అస‌లు ఎవ‌రీ దిద్దుకుంట శేఖర్ రెడ్డి అంటే.. తెలుగుదేశం పార్టీ నేత బిటెక్ రవికి అత్యంత సన్నిహతుడని సమాచారం. దిద్దుకుంట శేఖర్ రెడ్డి వివేకానంద‌రెడ్డి సన్నిహితుల్లో ఒక‌రైన పరమేశ్వర్ రెడ్డితో కుమ్మక్కయినట్లు చెబుతున్నారు.
వివేకానంద‌రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రులు గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల‌ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి, గంగిరెడ్డి, శేఖ‌ర్ రెడ్డిలు ముగ్గురు క‌లిసి ఒక ప‌థ‌కం ప్రకారం, ప‌క్కా ప్ర‌ణాళిక‌తో స్కెచ్ వేశార‌ని అనుమానిస్తున్నారు సిట్ అధికారులు. వివేకానంద‌రెడ్డి హత్యకు 15 రోజుల ముందు రెక్కీ నిర్వహించినట్లు కూడా చెబుతున్నారు. వివేకానంద‌రెడ్డి పెంపుడు కుక్క కూడా అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వ్యవహారాలు వివేకానంద‌రెడ్డి హత్యకు కారణమై ఉండవచ్చునని సిట్ అధికారులు భావిస్తున్నారు.