లక్ష్మీస్ ఎన్టీఆర్ కు లైన్ క్లియర్..!

SMTV Desk 2019-03-20 13:40:04  Lakshmis NTR,

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించాక నెలకొన్న పరిణామాల ఆధారంగా కాంట్రవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా విడుదల విషయంలో నెలకొన్న వివాదం గురించి తెలిసిందే. విడుదలను ఆపటానికి టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తుంన్నారు, ఈ సినిమా ఎన్నికలపై ప్రభావం చూపుతుందని ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసారు, అయితే, సినిమాను అడ్డుకోలేమంటూ ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పటంతో సెన్సార్ బోర్డు ద్వారా అయినా సినిమాను అడ్డుకుందామని చూసారు, అది కూడా వర్కౌటవ్వలేదు.

ఈ సినిమా విడుదలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది, ఆ పిటిషన్ ను పరిశీలించిన హై కోర్ట్, ప్రతి వ్యక్తికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుందని, దాన్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపాల్సిన అవసరం లేదని తేల్చేసింది. సినిమా సెన్సార్ పూర్తి కానుండటంతో ఈ నెల 29న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది సినిమా యూనిట్.