మిడిలార్డర్‌లో విజయశంకర్, కేదార్‌జాదవ్‌!

SMTV Desk 2019-03-20 13:07:11  Kedar Jadhav, Vijay Shankar, sanjay manjrekar, icc world cup 2019

న్యూఢిల్లీ, మార్చ్ 19: త్వరలో జరగనున్న ఐసిసి వరల్డ్ కప్ లో టీంఇండియా జట్టులో నాలుగు, ఐదో స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలో అని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్‌ ఇద్దరి పేర్లను సూచించారు. భారత మిడిల్‌ ఆర్డర్‌లో విజయశంకర్, కేదార్‌జాదవ్‌ ఇద్దరూ నాలుగు, ఐదో స్ధానంలో సరిపోతారని చెప్పాడు. విరాట్‌ కోహ్లి మినహా జట్టులో ఏ ఒక్కరూ పరిస్థితులకు తగినట్లు ఆడటం లేదని మంజ్రేకర్‌ ఓ క్రికెట్‌ ఛానల్‌కి చెందిన బ్లాగులో రాసుకొచ్చారు. రోహిత్‌ ఆడటానికి ప్రయత్నిస్తాడు కాని విఫల మౌతాడు. శిఖర్‌ ధావన్‌ వికెట్‌ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తాడు తప్ప జట్టుని ముందుండి నడిపించలేడు అని మంజ్రేకర్‌ చెప్పాడు.