తండ్రిని సవాల్ చేసిన కూతురు , ఆంధ్ర ఎన్నికల్లో రసవత్తర పోరు

SMTV Desk 2019-03-19 14:08:34  araku,

అరకు, మార్చ్ 19: ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానానికి పోటీ ఆసక్తికరంగా మారింది. అరకు లోక్‌సభ స్థానం నుంచి తండ్రీ కూతుళ్లు పోటీ పడడమే ఇందుకు కారణం. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వీడి టీడీపీలో చేసిన మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ ఆయన కుమార్తె శ్రుతీదేవిని అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది.

నిన్న రాత్రి కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో శ్రుతీదేవి పేరు ఖరారు కాగా, ఆమె తన తండ్రిని సవాల్ చేసేందుకే నిర్ణయించుకున్నారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గొడ్డేటి మాధవి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అరకు లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.