పరశురాం తో సూపర్ స్టార్

SMTV Desk 2019-03-19 14:07:30  Parashuram, Super Star,

లాస్ట్ ఇయర్ గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న పరశురాం తన తర్వాత సినిమా ఎవరో చేస్తాడు అన్న విషయంపై ఇంకా ఓ క్లారిటీ రాలేదు. గీతా గోవిందం సినిమా విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. పరశురాం తర్వాత సినిమా కూడా గీతా ఆర్ట్స్ లోనే ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా హీరో ఎవరన్నది తేలలేదు.

అసలైతే మెగా హీరో సాయి ధరం తేజ్ తో పరశురాం డైరక్షన్ లో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు. అయితే ఈమధ్యనే సూపర్ స్టార్ మహేష్ ను కలిసి పరశురాం ఓ కథ చెప్పాడట. లైన్ నచ్చిన మహేష్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. అల్లు అరవింద్ తో మహేష్ సినిమా గురించి కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది పరశురాం డైరక్షన్ లోనే ఉంటుందని తెలుస్తుంది. మహర్షి తర్వాత మహేష్ అనీల్ రావిపుడి సినిమా చేస్తాడని తెలుస్తుండగా ఆ సినిమా తర్వాత పరశురాం సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.