వైకాపాలోకి బిగ్ బాస్ ఫేమ్

SMTV Desk 2019-03-19 13:49:05  YSRCP, Tanish,

వైకాపాలోకి సినీనటులు వెల్లువ సాగుతోంది. ఇటీవలే కమెడియన్ అలీ పార్టీ తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. తాజాగా యువనటుడు, బిగ్‌బాస్ రియాల్టీ షో పోటీదారు తనీశ్ కూడా చేరారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో తనీశ్.. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. జగన్ అతనికి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఆశయాలు నచ్చడంతోనే తాను చేరానని తనీశ్ అన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానన్నారు.