టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ గా హుల్ చల్ చేస్తున్న విజయ్

SMTV Desk 2019-03-19 13:47:38  Tollywood, Vijay devarakonda,

ఇప్పుడున్న యువతరంలో విజయ్ దేవరకొండ అనే పేరు ఒక సంచలనం.ఇంకా చెప్పాలంటే తాను తీసిన సినిమాల వలన అబ్బాయిల్లో ఫాలోయింగ్ కన్నా అమ్మాయిల మనసులు ఈ రౌడీ హీరో కొల్లగొట్టేసాడు.ముందు చిన్న చిన్న పాత్రలకే పరిమితమైనా సరే అంచెలంచెలుగా ఎదిగి మంచి స్క్రిప్టులు ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే గత కొంత కాలం నుంచి చేసిన సినిమాల్లో “అర్జున్ రెడ్డి” నుంచి ఇప్పుడు తాజాగా చేస్తున్న “డియర్ కామ్రేడ్” వరకు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది.

ఆ కామన్ పాయింట్ వలన ఇప్పుడు ఈ రౌడీ హీరోకి మనోళ్లు ఒక సరికొత్త పేరు పెట్టేసారు.అర్జున్ రెడ్డి సినిమాలోని లిప్ కిస్ తో ఉన్న ఒక పోస్టర్ ఎంత సంచలనానికి దారి తీసిందో అందరికీ తెలిసినదే.అప్పుడు నుంచి మొదలు పెట్టిన విజయ్ ముద్దుల దండయాత్ర మొన్న విడుదలైన “డియర్ కామ్రేడ్” టీజర్ వరకు వదల్లేదు.”టాక్సీవాలా” మినహా “ద్వారకా”,”గీత గోవిందం”,”నోటా” ఇలా ప్రతీ సినిమాలోనూ విజయ్ లిప్ కిస్ లాగించేసాడు.దీనితో నెటిజన్స్ బాలీవుడ్ లోని పెదవి ముద్దులకు కేరాఫ్ అడ్రెస్ అయిన ఇమ్రాన్ హష్మి కి వారసుడుగా టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ అంటూ సరికొత్త పేరు పెట్టేసారు.భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన రష్మికా మందన్నా మరోసారి జత కట్టింది.