కాంగ్రెస్ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితా అవుట్

SMTV Desk 2019-03-19 12:50:41  congress, Congress List out,

దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగనున్న నేప‌ధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణ‌లో లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితాను విడుద‌ల చేసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే.. మొత్తం 25 లోక్‌స‌భ స్థానాల‌కు గానూ 23 స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసింది. మిగ‌తా రెండు నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. మొత్తం 17 లోక్‌స‌భ‌ స్థానాల‌కు గానూ.. 8 మంది పోటీ చేసే అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేసింది. మిగ‌తా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే కీల‌క‌మైన ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం నుండి మాత్రం పోటీ చేసే అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించ‌కపోవ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితా..

* నిజామాబాద్ – మధుయాష్కి

* సికింద్రాబాద్ – అంజన్ కుమార్ యాదవ్,

* హైదరాబాద్ – ఫిరోజ్ ఖాన్

* మహబూబునగర్ – వంశీ చందర్ రెడ్డి

* నాగర్ కర్నూల్ – మల్లు రవి

* నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి

* భువనగిరి – కోమటిరెడ్డి వెంకటరెడ్డి

* వరంగల్ – దొమ్మటి సాంబయ్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల జాబితా..

* బాపట్ల – జే.డి. శీలం.
* ఒంగోలు – సిరివెల్ల ప్రసాద్
* అమలాపురం – జంగా గౌతమ్
* గుంటూరు – ఎస్.కే. మస్తాన్ వలీ
* కాకినాడ – పల్లంరాజ
* కర్నూల్ – అహ్మద్ అలీఖాన్
* అనంతపురం – కే. రాజీవ్ రెడ్డి
* హిందూపూర్ – కే.టి. శ్రీధర్
* కడప – జి. శ్రీరాములు
* నెల్లూరు – దేవకుమార్ రెడ్డి
* తిరుపతి – చింతా మోహన్
* రాజంపేట – షాజహాన్ బాషా
* చిత్తూరు – శ్రీ రంగప్ప
* అరకు – శృతిదేవీ
* శ్రీకాకుళం – డోలా జగన్ మోహన్ రావు
* విజయనగరం – యడ్ల ఆదిరాజు
* అనకాపల్లి – శ్రీ రామమూర్తి
* రాజమండ్రి – ఎన్.వి. శ్రీనివాస్ రావు
* ఏలూరు – జెట్టి గురునాథరావు
* మచిలీపట్నం – బొల్లి కృష్ణ
* విజయవాడ – నరహరిశెట్టి నరసింహా రావు
* నరసరావుపేట – పక్కాల సూరిబాబు
* నరసాపురం – కనుమూర బాపిరాజు