డేటింగ్ చేస్తే అలాంటి వ్యక్తితోనే..!

SMTV Desk 2019-03-19 12:47:12  Dating, Niharika,

ఒక పెద్ద ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తే వావ్ సూపర్ అనేస్తారు.. అదే ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎవరైనా ఎంట్రీ ఇస్తానంటే మాత్రం బాబోయ్ వద్దు వద్దు అనేస్తారు. అయితే అలాంటివేమి పట్టించుకోకుండా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కథానాయిక నిహారిక కొణిదెల. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ సినిమా చేసింది. ప్రస్తుతం సూర్యకాంతం సినిమా చేసిన నిహారిక ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టారు. సూర్యకాంతం ప్రమోషన్స్ లో భాగంగా వినూత్నంగా 60 సెకండ్స్ విత్ సూర్యకాంతం అని నిహారిక పర్సనల్ విషయాలను డిస్కస్ చేశారు. వాటిలో భాగంగా డేటింగ్ గురించి చెబుతూ తను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటానని.. అలా తన మాటలను ఓపికగా వినే వ్యక్తితో డేటింగ్ చేస్తానని అన్నది. ఇక తను వరస్ట్ అని ఫీలయ్యే హ్యాష్ ట్యాగ్ ఏంటని ప్రశ్నిస్తే.. వన్ లైవ్ విత్ వల్ లవ్ అని చెప్పింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని తన మనసులో ఉన్నవే చెప్పింది అంతేకాని కవర్ చేసే ప్రయత్నమేమి చేయలేదు నిహారిక. మొత్తానికి ఈ మోడ్రెన్ సూర్యకాంతం అదేనండి నిహారిక సినిమా ఫలితాలు ఎలా ఉన్నా తన యాక్టింగ్ టాలెంట్ తో అందరిని అలరిస్తుంది.