తేజూ సినిమా బిజినెస్ అదరగొడుతుంది.

SMTV Desk 2019-03-19 12:46:12  Tej, Dharam Tej,

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్, కిశోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. వరుస ఫ్లాపులతో కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్న సాయి ధరం తేజ్ చిత్రలహరితో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ చూశాక సినిమాపై అంచనాలు పెరిగాయి. ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు ఫ్లాపులు ఎదుర్కున్న సాయి ధరం తేజ్ అయినా సరే చిత్రలహరి సినిమా బిజినెస్ విషయంలో అదరగొడుతున్నాడు.

ఏప్రిల్ 12న సినిమా రిలీజ్ ఉండగా ఇప్పటికే సినిమా బిజినెస్ క్లోజ్ అయ్యిందని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట సాయి ధరం తేజ్ చిత్రలహరి. కిశోర్ తిరుమల మార్క్ మూవీగా వస్తున్న చిత్రలహరితో తేజూ కచ్చితంగా సూపర్ హిట్టు కొట్టేలా కనిపిస్తున్నాడు. కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఎలాంట్ ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.