ఆర్సీబి తప్ప వేరే ఏ జట్టూ ఇష్టం లేదు : విరాట్

SMTV Desk 2019-03-19 12:28:48  team india, virat kohli, ipl, royal bengal challengers

బెంగళూరు, మార్చ్ 18: టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐపిఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబి) తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్సీబి తరపున కాకుండా మరే జట్టులో ఆడటం తనకిష్టం లేదని క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తేల్చి చెప్పాడు. బెంగళూరులో ఆర్సీబీ మొబైల్‌ యాప్‌ లాంచ్‌ సందర్భంగా కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా మొదటిసారి 2008లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యం కోహ్లిని జట్టులోకి తీసుకుంది. అప్పుడే టిమిండియాకు ఎంపికైన కోహ్లి అద్భుతంగా రాణిస్తూ జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కోహ్లి ఆర్సీబిలోనే కొనసాగాడు. ఐపిఎల్‌లో ఈ జట్టు నుంచి విడిపోవడం లేదా ఇతర జట్లలో ఆడటం ఊహించుకోలేనని అన్నాడు.