పరోక్షంగా ఉగ్రవాదులకు సాయం చేస్తున్న చైనా

SMTV Desk 2019-03-19 12:26:02  china, terrorists, china products, india

న్యూఢిల్లీ, మార్చ్ 18: చైనా ఉగ్రవాదులకు మొదటి నుండి తన పూర్తి మద్దతు తెలుపుతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఉగ్రవాదులకు చైనా ఏదోవిధంగా సహాయపడుతూ ఉంది. అయితే తాజాగా నిధులను నేరుగా కాకుండా చైనా ఉత్పత్లు ద్వారా పాక్‌ ఉగ్రవాదులకు నిధులు అందేలా చూస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనీస్‌ ఉత్పత్తులు భారతదేశంలోకి హావాల మార్గంలో ప్రవేశిస్తున్నాయని ట్రేడర్స్‌ బాడీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆరోపిస్తోంది. అక్రమ ఉత్పత్తుల ద్వారా వచ్చిన నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని చెబుతోంది. దీంతో పాటు అక్రమ మార్గంలో వస్తున్న ఉత్పత్తుల వల్ల కూడా భారత ఖజానాకు భారీ రెవెన్యులోటు వస్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలని సిఎఐటి వెల్లడించింది. చైనా దిగుమతులపై ఉక్కుపాదం మోపేందుకు ఇండియన్‌ పోర్ట్‌ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని కోరుతోంది. కాగా చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులను ఇన్‌ వాయిస్‌లో తక్కువ చూపించి, ఉగ్రవాదానికి నిధులు అందిస్తున్నాయని సిఎఐటి ఆరోపించింది.