మిగుల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల మయం చేశారు!

SMTV Desk 2019-03-19 12:21:46  kcr, trs, bjp, narendra modi, lakshman

హైదరాబాద్‌, మార్చ్ 18: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో ప్రధాని నరేంద్ర మోదీపై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తప్పుబడుతూ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌ సభలో బిజెపిపై, పార్టీ నాయకులపై ఆయన మాట్లాడిన పద్దతి సరిగ్గా లేదని, ప్రగతి భవన్‌, ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కెసిఆర్‌ దేశ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పుకునే కెసిఆర్‌ పార్టీ ఫిరాయింపులపై ఏం సమాధానం ఇస్తారని, మిగుల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో చక్రం కాదు, కెసిఆర్‌ కనీసం బొంగరం కూడా తిప్పలేరని లక్ష్మణ్‌ వ్యాగ్యంగా వ్యాఖ్యానించారు.