మోదీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతున్న కాశ్మీర్ యువకుడు

SMTV Desk 2019-03-19 12:13:34  narendra modi, loksabha elections, bjp, sajad nur abadi

లక్నో, మార్చ్ 18: లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి గట్టి పోటీ ఇవ్వడానికి ఒకప్పుడు ఎన్నికలను బాయ్‌కాట్ చేయాలని క్యాంపెయిన్ నిర్వహించిన సజద్ నూరాబది అనే కశ్మీర్ యువకుడు సిద్దమవుతున్నాడు. ఇతను కుల్గాం జిల్లాకు చెందిన సజద్.. హ్యుమానిటీస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి పొలిటికల్ యాక్టివిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీపై పోటీకి దిగాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మోదీ పాలనలో కశ్మీరీలు, ముస్లింల పరిస్తితి దారుణంగా మారిందని అందుకే అతను పోటీలో దిగుతున్నట్లు చెబుతున్నాడు. తాను ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి వారణాసి వెళ్లానని, ఇప్పుడు అక్కడి నుంచే పోటీకి దిగుతున్నట్లు తెలిపాడు.గతంలో అనంత్‌నాగ్ జరిగిన ఉపఎన్నికల్లో కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీపై సజద్ పోటీకి దిగాడు. కానీ హింసాత్మక ఘటనలు, అత్యల్ప ఓటింగ్ నమోదైన కారణంగా ఆ బైపోల్ రద్దయ్యాయి. ఈసారి మోదీపై ఎలాగైన పోటీ చేయాలని పట్టుబట్టిన సజద్.. ఇందుకోసం అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నాడు. తనకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా.. పోటీకి సిద్ధమని, లేకపోతే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసి, మోదీపై గెలుపొంది తీరుతానని పేర్కొంటున్నాడు.