‘అర్జున్ సురవరం’ ‘తికమక మకతిక’లిరికల్ సాంగ్ రిలీజ్

SMTV Desk 2019-03-19 12:10:14  Tikamaka Makatika Lyrical Song - Arjun Suravaram, Arjun Suravaram, Nikhil , Lavanya Tripati, T Santhosh , Sam C S

హైదరాబాద్, మార్చ్ 18: టాలీవుడ్ యువ హీరో నిఖిల్ హీరోగా నూతన దర్శకుడు టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘అర్జున్ సురవరం’. ఈ సినిమాలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా నుండి ఈ మధ్యే ‘కన్నే కన్నే’అనే మొదటి పాటను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా తికమక మకతిక అనే పాటను విడుదల చేశారు. ఈ పాట నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సామ్ సి ఎస్ పాటను కంపోజ్ విధానం, అలాగే సింగర్స్ నుండి ఆయన రాబట్టుకున్న పనితనం కారణంగా సాంగ్ బాగా ఇంప్రెస్స్ చేస్తోంది.ఇక మార్చి 29న విడుద‌ల అవుతున్న ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా.. కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.