ఐడియా వినియోగదారులకు శుభవార్త

SMTV Desk 2019-03-19 12:00:46  idea, amazon prime, idea amazon prime membership

మార్చ్ 18: టెలికాం సంస్థ ఐడియా తన వినియోగదారులకు ఓ ఆఫర్ ప్రకటించింది, రూ.399 అంతకన్నా ఎక్కువతో రిచార్డ్ చేసుకునే పోస్ట్ పెయిడ్‌ కస్టమర్ల కోసం.. అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా అందిస్తుంది. యాప్‌ స్టోర్‌ లేదా గూగుల్‌ ప్లేస్టోర్‌ ద్వారా ఐడియా మూవీస్ అండ్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయాలి. త‌రువాత మొబైల్ నంబర్‌ను ఎంట‌ర్ చేసి ఓటీపీ ద్వారా క‌న్‌ఫాం చేయాలి. అనంతరం వ‌చ్చే అమెజాన్ ఆఫ‌ర్‌ను ఎంచుకోవాలి. దీంతో క‌స్ట‌మ‌ర్ల‌కు ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్ ల‌భిస్తుంది. అయితే ఐడియా పోస్ట్ పెయిడ్‌ కస్టమర్లు.. రూ.399 అంతకు మించి రిచార్జ్‌ చేసుకునే వారికి ఉచితంగా లభిస్తుంది. ఇప్పటికే ఎయిర్‌ టెల్‌ పోస్ట్ పెయిడ్‌ కస్టమర్ల కోసం ఒక నెల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ను ఉచితంగా అందిస్తోంది.