అంచనాలను పెంచేస్తున్న ‘కళంక్‌’ ‘ఘర్‌ మోరే పర్‌దేశియా..’ సాంగ్ ...

SMTV Desk 2019-03-19 11:48:51  Ghar More Pardesiya, Kalank, Varun, Alia, Madhuri,Shreya, Vaishali, Pritam,

ముంబై, మార్చ్ 18: మాధురీ దీక్షిత్‌, సంజయ్‌ దత్‌, ఆలియా భట్‌, ఆదిత్య రాయ్‌ కపూర్‌, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కళంక్‌’. అభిషేక్‌ వర్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ ఇప్పటికే విడుదలై అభిమానుల అంచానాలు తారాస్థాయికియ చేర్చాయి. అయితే తాజాగా.. ఈ సినిమాలోని ‘ఘర్‌ మోరే పర్‌దేశియా..’ అనే తొలి పాట వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. శ్రేయా ఘోషల్‌, వైశాలి కలిసి పాడిన ఈ పాటకు..సినిమాలో మాధురీ దీక్షిత్‌ పాడుతుండగా.. యువరాణి అయిన ఆలియా.. ఆమెతో స్వరం కలిపటంతో పాటు అదిరిపేయేలా డ్యాన్స్‌ చేస్తుంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఓ యువరాణికి ఓ మామూలు వ్యక్తికీ మధ్య ప్రేమకథ.. ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ సెట్లతో నిర్మించిన ఈ సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.