నా కేసు నేనే వాదించుకుంటా, న్యాయవాది అవసరం లేదు!

SMTV Desk 2019-03-19 11:36:42  newzealand, central christchurch, masjeed, gun firing, 6men died, Christchurch mosque shooting

వెల్లింగ్టన్‌, మార్చ్ 18: ఈ నెల 15న ఉదయం న్యూజిలాండ్‌ లోని రెండు మసీదుల్లో దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఆ దుండగుడు బ్రెంటన్‌ టారంట్‌ను కోర్టులో కూడా హాజరుపరిచారు. ఈ కేసు విచారణ క్రైస్ట్‌చర్చ్‌ డిస్ట్రిక్‌ కోర్టులో కొనసాగుతున్నది. కాగా విచారణ సమయంలో అంతమందిని పొట్టనపెట్టుకున్నందుకు తనకు ఎలాంటి పశ్చాత్తానం లేదని నిందితుడు కోర్టుకు తేల్చి చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాక ఈ కేసుకు సంబంధించి ప్ర‌భుత్వం త‌ర‌పున లాయ‌ర్ రిచ‌ర్డ్ పీట‌ర్స్ వాదిస్తుండగా.. ఉన్మాది బ్రెంట‌న్ .. త‌న కేసును తానే వాదించుకుంటాన‌ని తనకు న్యాయవాది అక్కర్లేదని అంటున్నాడు. త‌న తరపున వాదించేందుకు నియ‌మించిన డ్యూటీ లాయ‌ర్ రిచ‌ర్డ్ పీట‌ర్స్‌ను తొలగించాలని., స్వయంగా తానే.. త‌న కేసును వాదించుకోవాల‌ని బ్రెంట‌న్ కోరుతున్నట్లు లాయ‌ర్ రిచర్డ్‌ తెలిపారు.