దేశంలో మొత్తం 2293 రాజకీయ పార్టీలు!

SMTV Desk 2019-03-18 18:33:39  indian political partys, election commission of india, bjp, congress, trs, tdp, janasena, dmk, anna dmk, bsp

న్యూఢిల్లీ, మార్చ్ 18: దేశంలో రోజుకో కొత్త పార్టీ ఆవిర్భవిస్తోంది. వివిధ రకాల కారణాలా వల్ల ఎవరికి వారు సొంతంగా పార్టీ పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్ని పార్టీలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈనెల 9వ తేదీ వరకు ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీల వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2293 రాజకీయ పార్టీలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల వేళ గుర్తింపు పొందిన ఏడు జాతీయ పార్టీలు, 59 ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 2143 పార్టీలు ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి మధ్య కాలంలో మరో 149 రాజకీయ పార్టీలు రిజిస్టర్‌ అయ్యాయి. ఇటీవల తెలంగాణ, మిజోరాం, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 58 పార్టీలు కొత్తగా రిజిస్టర్ అయ్యాయి. ఆ 149 పార్టీల్లో తెలంగాణలో భరోసా పార్టీ, రాజస్థాన్‌లో రాష్ట్రీయ సాఫ్‌ నితి పార్టీ, యూపీలో సమ్మోహిక్‌ ఏక్తా పార్టీ, బిహార్‌లో బహుజన్‌ అజాద్‌ పార్టీ, దిల్లీలో సబ్సీ బాడీ పార్టీలు వున్నాయి. కాగా, ఎన్నికల గుర్తు లభించని పార్టీలకు సొంతంగా పోటీ చేసే అర్హత లేదు.