నామినేషన్లకు మూడు రోజులు సెలవు

SMTV Desk 2019-03-18 18:32:28  loksabha elections, telangana

హైదరాబాద్‌, మార్చ్ 18: తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. ఐతే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 21వ తేదీ(హోలి), 23(నాలుగో శనివారం), 24(ఆదివారం)వ తేదీన సెలవులు కాబట్టి.. ఆ రోజుల్లో నామినేషన్లను స్వీకరించమని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలకు పూర్తి స్థాయి సిబ్బంది కేటాయింపులు చేశామని రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు.