గోవా ముఖ్యమంత్రిగా డాక్టర్ ప్రమోద్ సావంత్

SMTV Desk 2019-03-18 17:50:34  goa mukyamantri, pramod sawanth

గోవా, మార్చ్ 18: గోవా ముఖ్యమంత్రిగా డాక్టర్ ప్రమోద్ సావంత్ పేరును భారతీయ జనతాపార్టీ అధిష్ఠానం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మనోహర్ పారిక్కర్ కన్నుమూత వల్ల ఖాళీ అయిన ముఖ్యమంత్రి స్థానాన్ని ప్రమోద్ సావంత్ తో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు బీజేపీ గోవా శాఖ నాయకులు సూత్రప్రాయంగా తెలియజేశారు. ప్రస్తుతం ప్రమోద్ సావంత్.. గోవా అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. తొలుత- ప్రమోద్ సావంత్ తో పాటు విశ్వజిత్ రాణే పేరును కూడా బీజేపీ అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకుంది. ఈ మేరకు తమ మిత్రపక్షాలు ఎంజీఎఫ్, జీఎఫ్పీలతో బీజేపీ నేతలు చర్చలు జరిపారు. కాసేపట్లో సావంత్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.

గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. వీటిలో మనోహర్ పారికర్, మరో ఎమ్మెల్యే ఫ్రాన్సిస్ డిసౌజాల మరణంతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. మరో ఎద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో, సభలో ప్రస్తుతం 36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 19 కాగా... 14 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది.