భారీ అగ్నిప్రమాదం ..రూ.10 కోట్ల మేర ఆస్తి నష్టం

SMTV Desk 2019-03-18 17:39:58  Fire accident,

యాదాద్రి భువనగిరి, మార్చ్ 18: జిల్లాలోని భువనగిరి పట్టణంలోని పారిశ్రామికవాడలో ఉన్న శ్రీమహాసాయి కెమికల్‌ కంపెనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న సబ్‌కలెక్టర్‌ కార్యాలయం పాలనాధికారి ఎం.ఉపేందర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ఇతర పరిశ్రమల యజమానులను అప్రమత్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపుగా రూ.10 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.