ధోనీ గురించి చెప్పాలంటే

SMTV Desk 2019-03-18 12:07:52  rishab pant, Dhoni

న్యూఢిల్లీ, మార్చ్ 18: ఆటకంటే వివాదాలతో అతి తక్కువ కాలంలో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ వికెట్ కీపర్ , బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్. అయితే అటు కీపింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో వరస వైఫల్యాలతో అంతే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు. దీనిపై స్పందించిన పంత్.. ప్రతిక్షణం ప్రపంచకప్ జట్టులో స్థానం కా దృష్టిలో ఉంటుందని, అయితే ప్రస్తుతానికి తన ఏకాగ్రత అంతా ఐపిఎల్‌పైనే కేంద్రీకరించాలని అనుకుంటున్నానని అన్నాడు. తన జట్టును గెలిపించడానికి కృషి చేస్తానన్నాడు. ఒక క్రికెటర్‌గా తాను ప్రతినిత్యం పరివర్తన చెందుతున్నానని, ఏ విషయంలో మెరుగుపడాలో ధోనీతో మాట్లాడి సలహాలు తీసుకుంటున్నాని తెలిపాడు.

ధోనీగురించి చెప్పాలంటే ఆయన డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు, ఏ విషయంలో మాట్లాడే స్వేచ్ఛనిస్తాడు. ఓపికతో మంచి సలహాలు ఇస్తాడు అని పంత్ చెప్పాడు. అతి త్వరలో ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ ఐపిఎల్ అన్నిటికన్నా కాస్త భిన్నమైందన్నాడు. ఐపిఎల్‌కన్నా అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఎక్కువ ఒత్తిడికి గురి కావలసి వస్తుందని, అయితే జట్టు విజయం కోసం ఆ ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుందని చెప్పాడు. గత ఐపిఎల్‌లో పంత్ 52.61 సగటుతో 684 పరుగులు చేశాడు.