21 మంది సైనికులు మృతి

SMTV Desk 2019-03-18 09:27:25  terrorists,

మాలి: ఉగ్రవాదులు మాలిలో మరోసారి రెచ్చిపోయారు. మధ్య మాలిలోని ఓ సైనిక స్థావరంపై కొంత మంది ఉగ్రవాదులు ఆదివారం దాడులకు తెగబడ్డారు. దిచక్రవాహనాలు, కార్లలో వచ్చిన దుండగులు దియౌరాలోని ఆర్మీ క్యాంపుపై ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ దాడిలో 21 మంది సైనికులు మృతి చెందినట్లు అక్కడి సైనిక వర్గాలు ప్రకటించాయి. ఓ మాజీ సైనికాధికారి నేతృత్వంలో ఏర్పడిన ఉగ్రవాద ముఠానే దాడికి తెగబడ్డట్లు అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మాలిలో ఐసిస్‌ ఉగ్రవాదుల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది.