ఒలింపిక్ పతాక విజేతకు జన్మదిన శుభాకాంక్షలు.

SMTV Desk 2019-03-18 09:15:48  Sachin, Saina nehwal

ముంబయి: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సైనా ఆదివారంతో 30వ పడిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెండూల్కర్ సైనాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ..‘ఒలింపిక్ పతాక విజేతకు జన్మదిన శుభాకాంక్షలు. వీలయినంత త్వరగా కోలుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తావని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. సైనా కడుపు నొప్పితో బాధపడుతూ గత కొన్ని రోజులుగా ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కిడాంబి శ్రీకాంత్ కూడా సైనాకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు.