వారెవ్వా వాట్ ఏ క్యాచ్ ..

SMTV Desk 2019-03-17 18:44:02  Catch,

ముంబై మార్చ్ 17: సాధారణంగా మనదేశం లో క్రికెట్ ఆట అంటే ఇష్టముండని వారు ఎవరూ ఉండరు.తాజాగా రాబోతున్న ఐపీఎల్ సిరీస్ కోసం ఎంతో మంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.క్రికెట్ అంటే పట్టరాని అభిమానం ఉన్నవారు మన దగ్గర కోకొల్లలుగా ఉంటారు.ఈ క్రికెట్ లోనే ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకుంటాయి.అయితే సిక్సర్లు బాదడం కావచ్చు..అద్భుతమైన రీతిలో వికెట్లు పడగొట్టడం కావచ్చు,అన్నిటికన్నా మించి సిక్స్ బౌండరీ దగ్గర ఊహించని రీతిలో క్యాచ్ పట్టడం కావచ్చు.

ఇప్పుడు ఇలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇటీవలే మహారాష్ట్ర వర్సెస్ రైల్వేస్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ టి 20 మ్యాచులో తొలుత బ్యాటింగ్ కు దిగిన మహారాష్ట్ర 20 జట్టు వారు ఓవర్లలో 177 పరుగులు తీయగా మహారాష్ట్ర వారు 156 పరుగులకు ఆల్ అవుట్ అయ్యారు. చివరి ఓవర్లో మంజీత్ కొట్టిన బాల్ సరిగ్గా సిక్స్ బౌండరీ దాటుతుండంగా మహారాష్ట్ర ఫీల్డర్ రుతు రాజ్ గిక్వాద్ ఆపిన ఆ క్యాచ్ చూస్తే ఒక్కొక్కరి మతి పోవాల్సిందే..సరిగ్గా బౌండరీ దగ్గర ఇతను ఆపి వెనక్కి విసరగా దివ్యంగ్ హింగనేకర్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారగా ఈ వీడియో చూసిన నెటిజన్స్ వారెవ్వా అంటున్నారు.