సరికొత్త లుక్ లో అల్లు అర్జున్

SMTV Desk 2019-03-17 17:49:26  Allu arjun, Trivikram,

హైదరాబాద్, మార్చ్ 17: ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా మొదలు కాబోతున్న సంగతి తెలిసినదే.ఇంకా షూటింగ్ మొదలు కానీ సినిమా పై ఇప్పటికే చాలా కథనాలు బయటకి వచ్చాయి.నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత బన్నీ కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్కువ గ్యాపునే తీసుకున్నారు.రేసు గుర్రం సినిమా ముందు వరకు కాస్త సన్నగానే ఫిట్ బాడీతో ఉన్న బన్నీ ఆ తర్వాత నుంచి కాస్త ఒళ్ళు చేసినట్టు ఆ పై వచ్చిన సినిమాలు చూస్తేనే అర్ధమవుతుంది.

అలాగే నా పేరు సూర్య తర్వాత కూడా బన్నీ కాస్త లావైనట్టు కనిపించరు.అందుకనే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ సూచనల మేరకు బన్నీ సరికొత్త మేకోవర్ లో కనిపించేందుకు పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది.ఇప్పటికే తన పాత సినిమాల్లోలా లాంగ్ హెయిర్ లుక్ లోకి వచ్చేసారు.ఇదిలా ఉంటే తాజాగా బయటకు వస్తున్న ఫోటోలు చూసినట్లయితే బన్నీ బాగా బరువు తగ్గినట్టు కనిపిస్తున్నారు.తాజాగా వచ్చిన ఫొటోల్లో మాత్రం బన్నీ చాలా స్లిమ్ గా ఫ్రెష్ లుక్ తో కనిపిస్తున్నారు.ఇప్పటికే త్రివిక్రమ్ ఈ బన్నీతో రెండు మంచి సినిమాలు తీసారు.మరి ఇప్పుడు ఏం మాయాజాలం చేస్తారో చూడాలి.