కోహ్లీకి ధోనీ మాటంటే అంత గౌరవం

SMTV Desk 2019-03-17 17:46:09  Ravisastri, kohli,

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య చాలా తేడా ఉందంటున్నాడు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి. కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పి ఏళ్లు గడుస్తున్నప్పటికీ టీమిండియా ధోనీ కనుసన్నల్లోనే నడుస్తోంది. కారణం, కోహ్లీకి ధోనీ మాటంటే అంత గౌరవం. అలా అని కోహ్లీకి కెప్టెన్స్ రాదా అంటే ర్యాంకులని బట్టి చూస్తే ధోనీ లేని టెస్టు మ్యాచ్‌లలోనూ జట్టును గెలిపించి వరల్డ్ నెం.1 ర్యాంకుకు తీసుకెళ్లాడు.

కెప్టెన్సీల విషయంలో కోహ్లీ.. ధోనీల గురించి హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్టైల్. విరాట్.. ధోనీ గురించి చెప్పాలంటే వారిద్దరి కెప్టెన్సీలు వేర్వేరు. మహీ సీనియర్ పర్సన్. కోహ్లీ ఇప్పుడిప్పుడే ర్యాంకులతో ఎదుగుతోన్న క్రికెటర్. మాజీ కెప్టెన్ ధోనీపై ప్రత్యేక గౌరవాన్ని చూపిస్తుంటాడు కోహ్లీ. అదే గౌరవాన్ని కెప్టెన్‌గా ఉన్న కోహ్లీపై ధోనీ ప్రదర్శిస్తుంటాడు. ఒక కోచ్‌గా వాళ్లిద్దరి నుంచి ఇంతకుమించి నాకేం కావాలి అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

ఇటీవల ఆస్ట్రేలియాతో తలపడిన వన్డే సిరీస్‌లో టీమిండియా 2-3తేడాతో ఓడిపోయింది. గెలిచిన రెండు వన్డేల్లోనూ ధోనీ జట్టులో ఉన్నాడు. చివరి 3వన్డేలు ధోనీ సహకారం లేకుండా కోహ్లీసేన ఆడడంతోనే మ్యాచ్ ఓడిపోయామని విమర్శలు వినిపిస్తున్నాయి. స్టంప్స్ వెనుక నుంచి బౌలర్లకు సూచనలిచ్చే ధోనీ.. లేకపోవడంతో బౌలింగ్ విభాగం కూడా బలహీనపడిపోయింది. దీనిని బట్టి చూస్తే.. మే 30 నుంచి మొదలుకానున్న వరల్డ్ కప్ టోర్నీకి ధోనీని జట్టులోకి దాదాపు ఖాయంగానే కనిపిస్తోందని విశ్లేషకుల అంచనా.