ఇండొనేసియాలో వరద బీభత్సం

SMTV Desk 2019-03-17 17:13:45  indonesia,

భారీ వరదలు ఇండొనేసియాను ముంచేస్తున్నాయి. అక్కడి బోర్నియో దీవిలోని సుపాదియో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ వర్షం కురవడంతో లయన్ ఎయిర్ ప్యాసింజర్ విమానం ల్యాండ్ అవుతూ... రన్ వే నుంచీ పక్కకు వెళ్లిపోయింది. జకార్తా-పాంటియానాక్ మధ్య తిరిగే ఈ విమానంలో 182 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందీ ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.