కేజీఎఫ్ చాప్టర్ 2” విడుదల అప్పుడే

SMTV Desk 2019-03-17 15:36:43  KGF, KGF chapter 2,

గత ఏడాది విడుదలైన ఒక సినిమా కోసం టాలీవుడ్,బాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీల వారు కూడా పెద్ద ఎత్తునే చర్చించుకున్నారు.అదే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 1” అవ్వడానికి ఇది కన్నడ సినిమాయే అయినా విడుదలైన ప్రతీ చోట ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు.మన దగ్గర అయితే ఈ సినిమా చూసి యువత పిచ్చెక్కిపోయారు.ఆ రేంజ్ లో ఈ సినిమా మన వాళ్ళకి నచ్చేసింది.ప్రశాంత్ నీల్ టేకింగ్ కి తగ్గట్టు రవి బస్రర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు కొన్ని పాటలైతే వేరే రేంజ్ అనే చెప్పాలి.

ఈ అన్నిటితో ఈ సినిమా అతి పెద్ద హిట్ గా నిలిచి కాసుల వర్షాన్ని కురిపించింది.దీని తర్వాత “కేజీఎఫ్ చాప్టర్ 2” కూడా ఉందని తెలిపారు.దీనితో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలయ్యింది.అయితే ఈ సినిమా విడుదల అయితే కాస్త ఆలస్యంగానే వచ్చేలా ఉందని తెలుస్తుంది.ఈ సినిమాని వచ్చే ఏడాది ఒక పెద్ద పండుగ నాడు అందులోను మరో భారీ బాలీవుడ్ సినిమాతో పోటీగా విడుదల కానుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి.చాప్టర్ 1 దెబ్బకి చాప్టర్ 2 పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.మరి ప్రశాంత్ ఈ చిత్రాన్ని ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో చూడాలి.