జగన్ ఫ్యామిలీని విచారించనున్న సిట్ అధికారులు

SMTV Desk 2019-03-17 15:35:53  Jagan, Vivekanada reddy,

అమరావతి, మార్చ్ 17: ఇటీవల జరిగిన వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే వివేకానందరెడ్డి డ్రైవర్ సహా 10 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సిట్ అధికారులు జగన్ కుటుంబ సభ్యులు, బంధువులను విచారించనున్నారు.

ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం ఆర్థిక లావాదేవీలు, కుటుంబంలో గొడవలు, కాల్ డేటాపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఘటనాస్థలంలో దొరికిన లేఖను సిట్ అధికారులు పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదిస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు.