నా దృష్టిలో అతనే No. 4

SMTV Desk 2019-03-17 11:34:59  Ganguly, Pujara,

హైదరాబాద్, మార్చ్ 17: బెంగాల్ టైగర్ సౌరవ్‌ గంగూలీ టీం ఇండియా ఆటగాడు.. టెస్టు స్పెషలిస్టు పూజారా పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు .. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ తర్వాత మళ్లీ నాలుగో స్థానంలో ఆడే ఆటగాడిపై సందిగ్ధం ఏర్పడింది. అంబటి రాయుడు ఆశించిన మేరకు రాణించలేదు. విజయ్‌ శంకర్‌ కాస్త ఆశలు రేపాడు. పంత్‌నూ ప్రయోగించారు. అయితే ఎవ్వరిపైనా 100 శాతం నమ్మకం కుదరలేదు. దీంతో మళ్లీ ‘నంబర్‌ 4’పై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ‘చెతేశ్వర్‌ పుజారా’ పేరును గంగూలీ సూచించారు.

‘నేను చెప్పేది విని చాలా మంది నమ్మరు. కొందరు నా సూచన విని నవ్వుతారు. నా వరకైతే ‘నంబర్‌ 4’కు చెతేశ్వర్‌ పుజారా సరిపోతాడు. ఫీల్డింగ్‌లో అతడు మరీ చురుకు కాదని తెలుసు కానీ మంచి బ్యాట్స్‌మన్‌. నా ప్రతిపాదన విని షాక్‌ అవుతారని తెలుసు. కానీ టీమిండియా ప్రయత్నించిన ప్రత్యామ్నాయాలతో పోలిస్తే పుజారా నాణ్యమైన బ్యాట్స్‌మన్‌. కొన్నిసార్లు వన్డే క్రికెట్‌లో పటిష్ఠత అవసరమైనప్పుడు పుజారా ఆ కొరత తీరుస్తాడు. ముఖ్యంగా జట్టులోని టాప్‌-3 బ్యాట్స్‌మెన్‌కు టన్నుల కొద్దీ పరుగులు చేసే సత్తా ఉన్నప్పుడు అతడు జట్టులో చక్కగా ఇమిడిపోతాడు’ అని గంగూలీ అన్నారు.