IPL టికెట్స్ ఇలా బుక్ చేస్కోండి ...

SMTV Desk 2019-03-17 11:31:31  IPL. IPL 2019

హైదరాబాద్, మార్చ్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ ఎడిషన్... మార్చి 23న శనివారం ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడబోతున్నారు. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగబోతోంది. లోక్‌ సభ ఎన్నికలు వస్తుండటంతో... BCCI ముందుగా ఐపీఎల్ ఫస్ట్ పార్ట్ షెడ్యూల్‌ని మాత్రమే రిలీజ్ చేసింది. ఫస్ట్ పార్ట్ టోర్నమెంట్‌లో 17 మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండో పార్ట్ షెడ్యూల్ ఎప్పుడన్నది ఏప్రిల్ 11 న మొదలై మే 19న ముగిసే ఎన్నికల్ని బట్టీ ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో కారవాన్ ఫార్మాట్‌లో టీమ్స్‌ని వేర్వేరు నగరాల్లో మ్యాచ్‌లు ఆడేలా చేసే అవకాశాలున్నాయి. ఐతే... వీవో IPL టికెట్ల అమ్మకాలు ఆల్రెడీ మొదలయ్యాయి.

ఆన్‌లైన్‌లో టికెట్స్ కావాలంటే :
IPL 2019 tickets : Chennai Super Kings - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ల టికెట్స్ కావాలంటే బుక్ మై షోలో శనివారం (మార్చి 16) నుంచీ లభిస్తాయి. మార్చి 23న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోపాటూ... మార్చి 31న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడబోతోంది చెన్నై సూపర్ కింగ్స్.

IPL 2019 tickets: Mumbai Indians - ముంబై ఇండియన్స్ ఆడబోయే హోంగ్రౌండ్‌ వాంఖడే స్టేడియంలో ఇప్పటికే టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ మై షో ద్వారా కొనుక్కోవచ్చు. మూడుసార్లు ఛాంపియన్లు కావడంతో... ముంబై ఇండియన్స్ టికెట్ల సేల్స్ చాలా వేగంగా జరుగుతోంది. మార్చి 24న ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో వాంఖడే స్టేడియంలో తలపడబోతోంది. ఏప్రిల్ 3న చెన్నై సూపర్ కింగ్స్ తో రెండో మ్యాచ్ ఉంటుంది.