ముంబై లో యోగ మాస్టర్ వింత ప్రవర్తన.. కారణం తెలిస్తే షాక్

SMTV Desk 2019-03-17 11:29:42  Mumbai, Yoga master , rape

ముంబై, మార్చ్ 17:మానసిక ప్రశాంతతకు నిత్యం చేసే యోగా చాలా అవసరం. పని ఒత్తిడి కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నవారు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు. అయితే యోగా కారణంగానే ఓ మహిళ అనుకోని ఇరకాటంలో పడింది. ముంబైలో నివాసం ఉంటున్న ఓ 35 ఏళ్ల మహిళ... వెన్నునొప్పి సమస్యతో బాధపడుతోంది. వెన్నునొప్పి విముక్తి కోసం యోగా చేయాల్సిందిగా డాక్టర్లు కూడా సూచించడంతో 2016 నుంచి యోగా క్లాసులకు వెళ్తోంది. అయితే యోగా సాధన వల్లో లేక మరో కారణంగానే రెండేళ్లలో ఆమె సమస్య పూర్తిగా నయం అయిపోయింది. దాంతో ఆమె యోగా క్లాసులకు వెళ్లడం మానేసింది. ఆ తర్వాత జరిపించిన వైద్య పరీక్షల్లో సదరు మహిళకు హెర్నియా ఉన్నట్టుగా తేలింది. హెర్నియా నుంచి కోలుకునేందుకు కూడా యోగా ఉపయోగపడుతుందని చెప్పిన మాజీ యోగా గురూ... అవసరమైతే ఆమె ఇంటికే వచ్చి యోగా సాధన చేయిస్తానని చెప్పాడు.

అయితే ఇంట్లో యోగా చేసే సమయంలో అతను ఆమెను కావాలని ఎక్కడెక్కడో తాకుతూ ఇబ్బందులకు గురి చేసేవాడు. కుటుంబ గురించి, భర్త గురించి అడుగుతూ పర్సనల్ విషయాలు చెప్పాల్సిందిగా ఒత్తిడి చేసేవాడు. భర్తను వదిలేసి, తనను పెళ్లి చేసుకోవాలని కూడా కోరుతూ ఇబ్బందులకు గురి చేయడం మొదలెట్టాడు. ఈ కారణాల వల్ల కొన్నిరోజుల తర్వాత యోగా క్లాసులు మానేస్తున్నట్టు యోగా గురుతో చెప్పిందామె. దాంతో తీవ్ర ఆవేశానికి లోనైన సదరు యోగా గురు... ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ పోలీసులకు యోగా టీచర్‌పై ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.