''పుల్వామా దాడి పాక్ చరిత్రలో అత్యంత శుభ ఘడియ''...పాక్ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్

SMTV Desk 2019-03-16 19:18:31  pulwama attack, pakistan mp, pakistan, pakistan mp sensational comments on pulwama attack, Pakistani Senator Mushahid Hussain Sayed

ఇస్లామాబాద్, మార్చ్ 16: జమ్ముకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భారత సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన పాక్ ఉగ్రవాదుల దాడిపై తాజాగా పాకిస్తాన్ ఎంపీ దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. పుల్వామా దాడి పాక్ చరిత్రలో అత్యంత శుభ ఘడియ అని అన్నాడు. సెనేటర్ ముషాహిద్ హుసేన్ సయీద్ ఓ చర్చాకార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘నా దృష్టిలో 1998నాటి అణు పరీక్షల తర్వాత పుల్వామా దాడి పాకిస్తాన్‌లో అత్యంత శుభ సమయం.. ’ అని అన్నాడు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సయీద్.. పాకిస్తాన్-చైనా ఇన్ స్టిట్యూట్ అండ్ సెనేట్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ హోదాలో ఈ ప్రసంగం చేశాడు.