ఘనంగా విశాల్‌, అనీషాల నిశ్చితార్థం

SMTV Desk 2019-03-16 18:58:39  vishal, anisha

హైదరాబాద్, మార్చ్ 16: కోలీవుడ్ హీరో విశాల్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల తను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేశాడు విశాల్‌. హైదరాబాద్‌కు చెందిన అనీషాను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ రోజు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

ఎలాంటి ప్రకటన లేకుండా ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లా నిశ్చితార్థాన్ని ముగించారు. త్వరలోనే వివాహతేది పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నడిగర్‌ సంఘం భవనం నిర్మాణం అయిన తరువాత ఆ భవనంలోనే పెళ్లి చేసుకుంటానని విశాల్‌ చాలా సార్లు ప్రకటించాడు. త్వరలో భవనం నిర్మాణం కూడా పూర్తికానుందని తెలుస్తోంది. విశాల్‌ ప్రస్తుతం టెంపర్‌ రీమేక్‌గా తెరకెక్కుతున్న అయోగ్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.